![]() |
![]() |
.webp)
బుల్లితెర మొత్తం కూడా కొత్త కొత్త షోస్ తో ఫుల్ కలర్ ఫుల్ గా మారిపోయింది. అలాగే ఓటిటి ప్లాట్ఫామ్ కూడా కొత్త షోస్ తో మెరిసిపోతున్నాయి. ఇక కొత్తగా ఆహా ప్లాట్ఫామ్ మీద "చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే" పేరుతో ఒక కొత్త వంటల షో రాబోతోంది. ఈ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమోలో జిగేల్ డ్రెస్సులతో అంబటి అర్జున్, అమర్ దీప్ వచ్చారు. ఆ తర్వాత యాంకర్ విష్ణు ప్రియా -పృథ్వీ, సుప్రీత-యాదమ్మ రాజు, యూట్యూబర్స్ ఐన ప్రశాంత్-ధరణి ఈ షోలోకి వచ్చేశారు. హోస్ట్ గా సుమ, జడ్జ్ గా జీవన్ వచ్చారు. ఇక వంటగాళ్లందరికీ మైసూర్ బోండా చేయాలంటూ టాస్క్ ఇచ్చాడు. తర్వాత జీవన్ దీపికా దగ్గరకు వచ్చి "ఇందాకటి నుంచి ఇలా తిప్పుతూనే ఉన్నావ్" అన్నాడు.
"మీకోసం శానిటైజర్ కలిపి మరీ మైసూర్ బొండాలు వేస్తున్నాను" అనేసరికి జీవన్ షాకయ్యాడు. తర్వాత సుమ ఈ మైసూర్ బొండాలు రుచి చూసే పనిలో పడింది. వెంటనే తన భర్త రాజీవ్ కనకాల ఫోన్ చేసి "రాజా నేను సమీరా భరద్వాజ్- దీపికా చేసిన బొండాలు తినబోతున్నాను. లాస్ట్ కాల్ నీతో ఒకసారి మాట్లాడదామని చేశా" అని చెప్పింది. "ఏమైనా నీ ఆఖరి కోరిక" అన్నాడు రాజీవ్. "అంటే ఇదే నా ఆఖరి కోరిక అని నమ్ముతున్నావ్ కదా" అంది సుమ సీరియస్ గా. తర్వాత రాజీవ్ కానుకలతో దీపికా "రాజా గారు ఇక మీరు మంచి కలర్ ఫుల్ అమ్మాయిని చూసుకోండి" అని చెప్పేసరికి సుమ షాకయ్యింది. ఇక విష్ణు ప్రియా చేసిన బొండాలు రుచి చూడాలంటె కష్టం అని జీవన్ అనేసరికి "వాళ్ళు డబ్బులు పే చేస్తున్నారుగా కచ్చితంగా టేస్ట్ చేయాలి" అంటూ విష్ణుప్రియ సెటైర్ వేసింది. ఇక జీవన్ మీద దీపికా వేసిన పంచ్ మాములుగా లేదు " సిక్స్ తర్వాత వస్తుంది సెవెన్..జీవన్ గారు ఎక్కడ ఉంటె అక్కడ వస్తుంది హెవెన్" అనేసరికి జీవన్ అలా షాకై చూసాడు.
![]() |
![]() |